‘సింగమ్ అగైన్’లో ప్రభాస్.. ఏ పాత్రలోనంటే..?

-

Prabhas in Singham Again |యముడు, సింగం సినిమాలకు తెలుగులో ఎంత ఆదరణ లభించింది బాలీవుడ్‌లో అంతకు మించి ప్రేక్షకులను మెప్పించాయి. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిని ఈ సినిమాలో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాయి. దీంతో ఇదే లైనప్‌లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన రోహిత్ శెట్టి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అజయ్ దేవగన్(Ajay Devgn) ఫిక్స్ అయ్యాడు. అదే ‘సింగమ్ అగైన్’. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా గురించి వస్తున్న ఓ తాజా సమాచారం అంచనాలను తారామండాలాన్ని దాటిస్తున్నాయి. అదే ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడనడం. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నాడట. ఇప్పటికే తన పాత్రపై మూవీ మేకర్స్.. ప్రభాస్‌తో మాట్లాడటం, ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందట. తాజాగా రోహిత్ శెట్టి విడుదల చేసిన వీడియో కూడా ఇదే విషయాన్ని స్పష్టం కూడా చేస్తుంది. ‘సింగమ్ అగైన్’ ప్రభాస్ కేమియో తప్పకుండా ఉంటుంది.

- Advertisement -

కల్కి 2898 ఏడీ నేపథ్య సంగీతం వినిపిస్తుండగా గాల్లో ఎగురుతూ కిందకి దిగిన వాహనం ఆ వీడియోలో కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘‘ఈ హీరో లేకుండా ‘సింగమ్ అగైన్’ అసంపూర్ణం అవుతుంది. ఈ వాహనంలో హీరో ఉన్నాడు. దీపావళికి అందులో నుంచి దిగుతాడు’’ అంటూ రోహిత్ వాయిస్ వచ్చింది. దీంతో ఈ మూవీలో ప్రభాస్(Prabhas) కనిపించనున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఈ సినిమా కేమియో పోలీస్‌గా ఇస్తాడా.. లేకుంటే ఏదైనా స్పెషల్ ఏజెంట్ లెక్కలో ఇస్తాడా అనేది ఇప్పుడు ప్రభాస్ అభిమానుల మదుల్లో మెదులుతున్న ప్రశ్న. దీనికి సమాధానం కావాలంటే కనీసం దీపావళి వరకు ఆగాల్సిందే. లేకుంటే సినిమా రిలీజ్ వరకు.

Read Also: కరివేపాకు టీతో ఇన్ని అద్భుతాలా..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...