తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలు చేస్తున్నాడు… ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు… ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తో చేస్తున్నాడు ఈ చిత్రం తర్వాత డార్లింగ్ నాగ్ అశ్విన్ తో మరో చేస్తున్నాడు… దాని తర్వాత హిందీలో ఆదిపురుష్ చిత్రం చేస్తున్నాడు…
ఇందులో తొలతు ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.. కారోనాకు ముందు విదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది.. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కాస్తా పెండింగ్ లో ఉంది.. రోజురోజుకు కరోనా విజృంభన కొనసాగుతుండటంతో విదేశీ తరహాలో షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, రోడ్లును హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో ఏర్పాటు చేసి షూటింగ్ చేయాలని చూశారు…
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇటలీలో పరిస్థితి కాస్త తగ్గుముఖం పట్టిందని వార్తలు వస్తుండటంతో ఈ సెట్స్ ను వదిలేసి ప్రభాస్ తో సహా చిత్ర యూనిట్ తిరిగి ఇటలీకి వెళ్లిందట…