శృతిహాస‌న్ కోసం అదిరిపోయే వంట‌కాలు చేయించిన ప్ర‌భాస్

Prabhas, who made delicious dishes for Shruti hassan

0
278

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స‌లార్, ఆదిపురుష్‌, రాధే శ్యామ్, సినిమా చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ సెట్ లో అంద‌రితో చాలా స‌ర‌దాగా ఉంటారు. ఒక్కోసారి ఆయ‌న ఇంటి నుంచి అనేక ర‌కాల స్పెష‌ల్ వంట‌కాలు తీసుకువ‌స్తారు అంద‌రికి కూడా ఈ ఫుడ్ ఇస్తారనే విష‌యం తెలిసిందే. ముఖ్యంగా గోదావ‌రి రుచులు కూడా చూపిస్తారు. ప్ర‌భాస్ షూటింగ్ స‌మ‌యంలో చాలా స‌ర‌దాగా ఉంటారు అని అంటారు అంద‌రూ.

సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్ కోసం ప్రత్యేకమైన వంటలు చేయించాడు ప్రభాస్. ఇప్పుడు స‌లార్ షూటింగ్ స‌మ‌యంలో శృతిహాస‌న్ కోసం దాదాపు 20 ర‌కాల వంట‌కాలు చేయించార‌ట‌ స్పెష‌ల్ గా.
ప్రతీ ఒక్క వంటకం గురించి తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది శృతి.

అవి చాలా రుచిక‌రంగా ఉన్నాయ‌ని చెప్పింది. ఇన్ని రకాల వంటకాలను తన ముందు పెట్టినందుకు థ్యాంక్యూ అంటూ కామెంట్ రాసుకొచ్చింది. ఇక బాహుబ‌లి ఏమి వంట‌కాలు తెచ్చారంటే
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీలు ఉన్నాయి.
మొత్తం యూనిట్ అంద‌రికి ఈ ఫుడ్ అందించార‌ని తెలుస్తోంది.