ప్రభాస్ వచ్చేస్తున్నారోచ్ – అభిమానులకి గుడ్ న్యూస్

ప్రభాస్ వచ్చేస్తున్నారోచ్ - అభిమానులకి గుడ్ న్యూస్

0
98

ప్రభాస్ తాజాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణతో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా గురించి ఒక్క విషయం కూడా బయటకు రావడం లేదు. అయితే ఇంత కరోనా వైరస్ గురించి వార్తలు వినిపిస్తున్నా, ఆ చిత్ర యూనిట్ మాత్రం అవేమీ లెక్క చేయకుండా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

జార్జియా షూటింగ్ షెడ్యూల్ మంగళవారంతో పూర్తయింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జార్జియాలో ఉన్న ప్రభాస్, చిత్రబృందం ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందారు… మొత్తానికి దర్శకుడు చిత్ర టీం అంతా అక్కడ షెడ్యూల్ పూర్తి కావడంతో బ్యాక్ వచ్చేస్తున్నారు.

వీరందరూ హైదరాబాద్కు తిరుగుప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ జెట్లో తీసుకున్న ఫోటోను దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రభాస్తో పాటు దర్శకుడు రాధాకృష్ణ, చిత్ర నిర్మాత ప్రమోద్, నటుడు ప్రభాస్ శ్రీను తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు. ఇక ప్రభాస్ అభిమానులకు ఉగాదికి ఈ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.