తెలుగులో యాంకర్స్ శ్రీముఖి ప్రదీప్ లు వరుస షోలు చేస్తూ దూసుకుపోతున్నారు.. తాజాగా కమ్ బ్యాక్ షోలు స్టార్ మ్యూజిక్ రీలోడెడ్, లోకల్ గ్యాంగ్స్ ల ఆరంభం అదిరిందని లేటెస్ట్గా విడుదలైన టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. తాజాగా శ్రీముఖి కొత్తగా స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ అనే గేమ్ షోతో ముందుకు వచ్చింది.. దీంతో తన అభిమానులని అలరిస్తోంది, ఆమె హోస్ట్ చేస్తున్న గేమ్ షో గురువారం, శుక్రవారం, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది. ఇక తాజా టీఆర్పీ రేటింగ్స్ బట్టి చూస్తుంటే.. శ్రీముఖి షోకు మంచి నెంబర్ రేటంగ్ లో వచ్చినట్లు తెలుస్తోంది.
దాదాపు టాప్ 1 లో ఆ షో నిలిచింది అని తెలుస్తోంది.. అయితే మూడు లేదా నాలుగు స్ధానాల్లో ఉంటుంది అనుకుంటే టాప్ వన్ కు రావడం వారిని ఖుషీని చేసింది. మరో పక్క యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్న లోకల్ గ్యాంగ్స్ షో ప్రతి శనివారం జీ తెలుగులో ప్రసారమవుతోంది. యాంకర్ రవి, తేజస్విలు టీమ్ లీడర్లుగా ఉన్న ఈ షోకు.. అనసూయ, జానీ మాస్టర్ జడ్జ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా మంచి టీర్పీలు సంపాదించుకుంది.
అయితే టాప్ 3లో ఇది రికార్డు క్రియేట్ చేసింది అని తెలుస్తోంది..కార్తీక దీపం ఎప్పటిలానే టాప్లో ఉండగా వదినమ్మ, గోరింటాకు, మౌనరాగం, ఈటీవీ న్యూస్ ప్రోగ్రాం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సో శ్రీముఖి ప్రదీప్ లు వరుసగా షోలతో అభిమానులని అలరిస్తున్నారు.