తగ్గని ‘మా’ హీట్..ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు

Prakash Raj complains to election official

0
93

‘మా’ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష పదవి బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నిలిచి తమ ప్యానల్ ను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్‌ ఉల్లంఘిస్తోందంటూ ఆయన ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగం అవుతోందని చెప్పారు. ఈ మేరకు తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు చేశారు.