పాత్ర ఏదైనా ఒదిగిపోయి నటించి ఆ పాత్రకే వన్నె తెచ్చే నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj). తన సినీ కెరీర్‌లో ప్రకాష్.. అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. మెప్పించాడు. పాత్ర తనకంటే ఎవరూ బాగా చేయలేరన్న భావనను కలిగించాడు. నాన్న పాత్రలో కూడా ఔరా అనిపించడమే కాకుండా ఆ పాత్రకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. బొమ్మరిల్లు ఫాదర్‌గానే కాకుండా ‘ఆకాశమంత’లో కూతుర్ని అమితంగా ప్రేమించే తండ్రిగా కూడా అందరినీ మెప్పించాడు అటువంటి ప్రకాష్ రాజ్ తాజాగా మరోసారి తండ్రి పాత్రలో నటించడానికి సిద్ధమయ్యాడు. ఈసారి కూడా ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా ప్రకాష్.. నటించడానికి ఓకే చెప్పాడు.
కన్నడలో ‘ఫాదర్(Father Movie)’ అనే టైటిల్‌తో తెరకెక్కకుతున్న సినిమాలో టైటిల్ పాత్ర.. అదే తండ్రి పాత్రలో ప్రకాష్(Prakash Raj) కనిపించనున్నాడు. లవ్ మాక్ టైల్ సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న డార్లింగ్ కృష్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆర్ చంద్రు తన కొత్త బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ‘నీ కోసం ప్రతి ఒక్కటి త్యాగం చేసే వ్యక్తి నాన్న. ఇట్స్ ఎమోషన్ జర్నీ’ అంటూ బెంచ్‌పై కూర్చున్న ప్రకారాజ్‌ను చూపించారు. మరి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషిస్తున్న ఈ ఫాదర్ రోల్.. బొమ్మరిల్లు, ఆకాశమంత సినిమాల్లోని ఫాదర్ పాత్రలా గుర్తుండిపోయే అంత హిట్ అవుతుందో లేదో చూడాలి.