ప్రభుధేవా రెండో వివాహం చేసుకోబోతున్నారు అని రెండు వారాలుగా వార్తలు వినిపిస్తున్నాయి, ఆయన తన కుటుంబంలో ఓ యువతిని వివాహం చేసుకుంటున్నారు అని ఇప్పటి వరకూ అనేక వార్తలు వినిపించాయి, తాజాగా ఈ
దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
బీహార్కు చెందిన ఫిజియోథెరపిస్ట్ ని ఆయన వివాహం చేసుకున్నారు అని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది, కాని ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాకుండా దానిని మేము నమ్మం అంటున్నారు ఆయన అభిమానులు.
గతంలో వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారని అంటున్నారు.1995లో రామలతను వివాహం చేసుకున్న ప్రభుదేవా 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయం తెలిసిందే, ఇక తర్వాత నయనతో ఆయన ప్రేమలో ఉన్నారు తర్వాత ఆమెకి బ్రేకప్ చెప్పారు.