తన తొలి డైరెక్టోరియల్ ‘హనుమాన్(Hanuman)’ సినిమాతో యావత్ దేశమంతటా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma). ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేమికులంతా కూడా ప్రశాంత్ రెండో ప్రాజెక్ట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమా అంటే రాజమౌళి సినిమాకు ఉన్నంత క్రేజ్ ఉంది. పెద్ద హీరోలు కాకుండా యంగ్ హీరోలతో ప్రశాంత్ వర్మ.. బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్నాడు. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి కూడా ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌లపైనే ఉంది. అటువంటిది తాజాగా అవకాశమిస్తే డైరెక్షన్‌కు స్వస్తి చెప్తానంటూ ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన ప్రశాంత్ ఈ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చపరిచాడు.
‘‘నేను ఇండస్ట్రీలోకి రాకముందే 33 కథలు రాసుకున్నాను. ఇప్పటివరకు తీసిన సినిమాలకు, నేను రాసుకున్న కథలకు ఎటువంటి సంబంధం లేదు. సినిమాలు తీసినవన్నీ కొత్త కథలే. కథలు రాయడం అంటే నాకు చాలా కష్టమైన పని. అవకాశం ఇస్తే నేను డైరెక్షన్ చేయడం మానేసి వేరే దర్శకులకు కథల రాయడానికి ప్రాధాన్యతనిస్తాను. అవసరమైతే బోయపాటి శ్రీను(Boyapati Srinu) కు కూడా కథలు రాసిస్తాను’’ అని ప్రశాంత్ చెప్పాడు. ప్రశాంత్ మాటలు చాలా మందిని షాక్‌కు గురి చేస్తున్నాయి. దర్శకుడిగా అవకాశం దొరకడం చాలా కష్టం. అలాంటిది అవకాశం దొరికి, అందులోనూ ఇంత టాలెంట్ చూపి.. ప్రేక్షకుల ఆదరణ పొందిన తర్వాత డైరెక్షన్ మానేయాలని అనుకోవడం ఏంటి అని ప్రశాంత్(Prasanth Varma)ను ప్రశ్నిస్తున్నారు అభిమానులు.