‘NTR31’ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్‌..!

0
98

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అర‌వింద స‌మేత’ త‌ర్వాత దాదాపు నాలుగేళ్ళ‌కు ట్రిపుల్ఆర్‌తో ఎన్టీఆర్ ప్రేక్షకులను పలకరించాడు. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో తార‌క్ న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇదిలా ఉంటే తార‌క్ త‌న నెక్స్ట్ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌శాంత్‌నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో ‘స‌లార్’ చేస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌శాంత్‌నీల్‌తో అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన తార‌క్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాల‌ను నెల‌కొల్పింది.

ఎప్పుడెప్పుడు సినిమా మొద‌ల‌వుతుందా అని ఎదురుచూస్తున్నా తారక్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం. ఎన్టీఆర్‌తో చేయ‌బోయే సినిమా ఏప్రిల్, మే నెల‌లో ప్రారంభం కానుంద‌ని తెలిపాడు. ఈ అప్‌డేట్‌తో నంద‌మూరీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. చూడాలి మరి..ఈ సినిమా ఎలాంటి విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకోబోతుందో..!