మరో కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వంటలక్క – ప్రేమి విశ్వనాథన్

Premi Viswanath- The upcoming vantalakka with another new serial

0
181

వంటలక్క దీపకు తెలుగు స్టేట్స్ లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ ని చాలా మంది చూస్తు ఉంటారు. ఇక డాక్టర్ బాబు వంటలక్క కలిసిపోతారు అని అనుకుంటున్న సమయంలో, మౌనిత ప్రెగ్మెంట్ అవ్వడంతో సీరియల్ సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ కరతముత్తులో నటించే అవకాశం దక్కించుకుంది ప్రేమి విశ్వనాథన్. ఇక అక్కడ నుంచి ఆమెకి బుల్లితెరలో ఎన్నో అవకాశాలు వచ్చాయి.

2013 లో మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించిన ఈ సీరియల్ ఇప్పుడు తెలుగులో కార్తికదీపంగా వస్తోంది. సుమారు 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పటికీ అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకుపోతుంది. కరతముత్తు తర్వాత దీప మరో రెండు సీరియల్స్ లో, రెండు తమిళ చిత్రాల్లో నటించింది.

ఈ కేరళ ముద్దుగుమ్మ మరో సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.మలయాళంలో దేవిక పేరుతో ఈ సీరియల్ ప్రసారం కానుంది. జూలై 5 నుంచి సూర్య టీవీలో రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారంకానుంది. దేవిక సీరియల్ లో మోడ్రన్ లుక్ లో మోడ్రన్ డ్రెస్ ల్లో స్టైలిష్ గా కనిపించనుంది.