హీరో పునీత్​ రాజ్​కుమార్​కు ప్రతిష్టాత్మక అవార్డు

Prestigious award for hero Puneet Rajkumar

0
113

కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్​ను ప్రతిష్టాత్మక బసవ శ్రీ అవార్డు-2021 వరించింది. ఈ విషయాన్ని మురుగ మఠ్ స్వామిజీ డాక్టర్. శివమూర్తి మురుగ శరన గురువారం వెల్లడించారు. వచ్చే ఏడాది బసవ జయంతిన పునీత్​ కుటుంబానికి ఈ అవార్డు అందజేస్తామని స్వామిజీ చెప్పారు. ఈనెలలోనే ఆయన కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని అన్నారు.

కన్నడలో హీరోగా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న పునీత్​ రాజ్​కుమార్.. వారి మనసుల్లో చోటు సంపాదించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. పునీత్.. అక్టోబరు 29న కార్డియాక్ అరెస్ట్​ వల్ల హఠాన్మరణం చెందారు. ఆ సమయంలో అభిమానులతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పునీత్​తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

తమ ఫేవరెట్​ హీరో సినిమాలు ఇకపై వెండితెరపై చూడలేమని చాలా బాధపడుతున్నారు. అయితే పునీత్​ చివరి సినిమా ‘జేమ్స్​’ను ఆయన జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.