ప్రిన్స్ సినిమాలో శ్రుతి హాసన్ మరో జాక్ పాట్

ప్రిన్స్ సినిమాలో శ్రుతి హాసన్ మరో జాక్ పాట్

0
84

తెలుగులో సూపర్ హిట్ సినిమాలు చేసింది శ్రుతి హాసన్, తర్వాత హిట్ పరంపర తగ్గింది.. అయితే ఇటీవల సినిమాల జోరు కూడా కాస్త తగ్గింది.. నాజూకు అందాల సొగసులతో కుర్రకారుని మత్తెక్కిస్తుంది ఈ భామ.. అయితే ఆమె బాలీవుడ్ కు కూడా వెళ్లింది.. అంతే కెరియర్ పీక్స్ లో ఉండగా ప్రేమలో పడింది. ఆ మైకం నుంచి మళ్లీ బయటకు వచ్చింది . ప్రియుడు హ్యాండ్ ఇచ్చాక శ్రుతి హాసన్ సినిమా లోకంలోకి వచ్చింది.

హిందీతో పాటు తెలుగులోను సినిమాలు చేయడానికి శ్రుతి హాసన్ ఉత్సాహాన్ని చూపుతోంది.. తాజాగా తెలుగులో సినిమాలు చేసేందుకు రెడీ అయింది ఈ మధ్య తెలుగు సినిమాల దర్శకులు కథలు కూడా చెప్పారట.. తాజాగా రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మహేశ్ బాబు తదుపరి సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందనేది తాజా సమాచారం వినిపిస్తోంది టాలీవుడ్ లో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.

ఇక ప్రిన్స్ తో మళ్లీ చాన్స్ అంటే ఆమెకు లక్ అనే చెప్పాలి, ఇది కూడా హిట్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు, అయితే మహేష్ బాబుతో సినిమా అంటే పదిమంది తారలు ఉన్నారు.. కాని తాజాగా శ్రుతి హాసన్ అవకాశం చేజిక్కించుకోవడంతో టాలీవుడ్ లోకూడా ఆమె మళ్లీ సూపర్ సక్సెస్ బాటలోకి వస్తోంది అంటున్నారు దర్శక నిర్మాతలు.. చూడాలి ఆమె మరెన్ని సినిమాలు లైన్ లో పెడుతుందో.