త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళితో ప్రిన్స్ సినిమా ?

Prince Mahesh movie with Rajamouli after Trivikram movie?

0
112

ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారనే ప్రకటన రావడంతో ఇటు అభిమానులు ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు అన్నీ ఒక ఏడాది వెనక్కి వెళ్లిపోయాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక సర్కారు వారి పాట చిత్రం తర్వాత ప్రిన్స్ త్రివిక్రమ్ తో సినిమా ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక త్రివిక్రమ్ సినిమా లైన్ లో పెట్టనున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన అతడు సినిమాని మించి ఉంటుంది అంటున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా చేయనుందట. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ప్రిన్స్ త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారట. రాజమౌళికి కొన్ని ఎక్కువ డేట్స్ ఇవ్వాలి కాబట్టి త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ప్లాన్ చేసుకున్నారు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా పూర్తి అయ్యాక ఇది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందట.