ప్రిన్స్ సరిలేరు నీకెవ్వరూ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

ప్రిన్స్ సరిలేరు నీకెవ్వరూ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

0
92

ప్రిన్స్ మహేష్ బాబు వరుసగా హిట్స్ కొడుతున్నారు.. వెను వెంటనే వరుసగా సినిమాలతో బిజీ స్టార్ గా ఉన్నారు. అయితే తాజాగా ఆయన సరిలేరు నీకెవ్వరు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకిగాను పారితోషికంగా మహేశ్ బాబుకి ఎంత మొత్తం వచ్చింది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారిపోయింది.

అయితే టాప్ హీరోల్లో సౌత్ ఇండియాలో మహేష్ నెంబర్ వన్ స్ధానంలో ఉన్నారు.. ఆయన సినిమా అంటే పారితోషికం కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా నిమిత్తం ఆయనకి 40 కోట్లవరకూ ముట్టిందనే ఫిల్మ్ నగర్లో బలంగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పారితోషికం కింద ఆయన శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ ను తీసుకున్నాడని అంటున్నారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా 15 కోట్ల రూపాయల వరకూ వచ్చింది అంటున్నారు.

మొత్తానికి ప్రిన్స్ సినిమాల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాగా ఇదే రికార్డు అంటున్నారు.. అయితే వరల్డ్ వైడ్ ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అలాగే ఉన్నాయి.. అలాగే ఫ్యామిలీ చిత్రం కాబట్టి సంక్రాంతి బరిలో దిగుతోంది.. అందుకే ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నారు.. సాధారణం కంటే సంక్రాంతి లో డబుల్ వసూళ్లు సాధిస్తాయి అనేది తెలిసిందే .అందుకే సంక్రాంతి బరిలో వస్తోంది సరిలేరు నీకెవ్వరూ.