ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ కు కూడా మాంచి క్రేజీ కాంబినేషన్ గెస్ట్ లు సెట్ అయ్యారు. అవును చిత్ర యూనిట్ నేడు వారు ఎవరో చెప్పనుంది, కాని వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు తో పాటు వేదికను మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పంచుకోనున్నారని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన సుముఖత చెప్పేసారు. ఆయన రావడం పక్కా. ఎన్టీఆర్ కూడా ఓకె చెప్పాల్సి వుంది. అది కూడా ఈరోజు ఫైనల్ అయితే సాయంత్రం ప్రకటన చేయనుంది చిత్ర యూనిట్, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఫంక్షన్ కు వెళ్లాల్సి ఉంది మరి ఎన్టీఆర్ ఎటు వెళతారా ఇటు వస్తారా అనేది చూడాలి.
ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో సినిమా యూనిట్ డిఫెన్స్ లో పడింది అని వార్తలు వస్తున్నాయి. మెగా హీరో ఫంక్షన్ కు రావడానికి మరే మెగా హీరో వున్నట్లు అని చర్చించుకుంటున్నారు పవన్ కల్యాణ్ ని పిలుస్తారా అని చర్చ జరుగుతోంది. అల వైకుంఠపురంలో విశాఖలో ఫంక్షన్ చేయనున్నారు అంటున్నారు. మరి హైదరాబాద్ కు మారుతుందా అనేది చూడాలి.