Prithviraj Sukumaran | ప్రమాదంలో గాయపడ్డ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌‌

-

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌(Prithviraj Sukumaran) ప్రమాదంలో గాయపడ్డాడు. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో జరిగిన షూటింగ్‌లో కాలికి బలమైన గాయం తగిలింది. కేరళలోని మరయూర్ బస్టాండ్ వద్ద ఎస్ఆర్టీసీ బస్సులో ఫైట్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫైట్‌ సీన్‌లో ఆయన జారి పడ్డాడు. దీంతో కాలికి గాయం తగలడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ రోజు (సోమవారం) ఉదయం పృథ్వీరాజ్‌(Prithviraj Sukumaran) కాలికి శస్త్ర చికిత్స జగరనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ రెండు, మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారని టాక్‌. ఐతే ప్రాణాపాయమేమీలేదని, చిన్న గాయాలే అని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మలయాళంలో విలయత్ బుద్ద అనే సినిమాలో నటిస్తున్నాడు.

- Advertisement -
Read Also:
1. మెస్సీకి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్
2. వెస్టిండీస్‌ టూర్‌కు సెలక్ట్ అవుతానని ఊహించలేదు: టీమిండియా పేసర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...