Salaar: భయపెడుతున్న వర్ధ రాజ మన్నార్‌

-

Salaar: కేజీఎఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సలార్(salaar)‌ మూవీ అప్‌డేట్స్‌ సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ప్రభాస్‌ ఆరడుగల హీరోయిజాన్ని.. అంతటి విలనిజంతో ఢీకొట్టేందుకు మళయాల హీరోను రంగంలోకి దించారు. మళయాల లవర్‌ బాయ్‌గా చెప్పుకునే హీరో, దర్శకుడు పృథ్వీరాజ్‌ సలార్‌ (Salaar)లో విలన్‌ రోల్‌లో భయపెట్టనున్నాడు. ఆదివారం పృథ్వీరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా, సలార్‌లోని ఆయన ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఒంటినిండా మసి, మెడలో కడియాలు, ముక్కుకు పోగుతో పృథ్వీ భయంకరంగా ఉన్నారు. వర్ధ రాజ మన్నార్‌ అనే పాత్రలో పృథ్వీరాజ్‌ భయపెట్టనున్నారని సినీ యూనిట్‌ తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న సినిమా విడుదల కానుంది. కాగా, పృథ్వీరాజ్‌ లుక్‌ని చూసి నెటిజన్స్‌ షాక్‌కు గురయ్యారు. లవర్‌ బాయ్‌ను ఇంత క్రూరంగా చూపిస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ లుక్‌పై మీమర్స్‌ రెచ్చిపోతున్నారు. ఇంకొంచెం బొగ్గు రాయాల్సింది సర్‌ అంటూ మీమర్స్‌ జోక్స్‌ పేల్చుతున్నారు. ఇంతకీ మీకెలా అనిపించింది వర్ధ రాజ మన్నార్‌ లుక్‌?

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...