Live OTT | ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ

-

ప్రస్తుతం మూవీ అభిమానులు థియేటర్ కంటే ఎక్కువగా ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా మహమ్మారి మూలంగా విధించిన లాక్‌డౌన్ మూలంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఓటీటీపై ఇష్టం పెరిగిపోయింది. అంతేగాక, అందులో వచ్చే ఇంట్రెస్టింగ్ సినిమాలకు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఓటీటీల్లో థ్రిల్లర్‌ మూవీస్‌ను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లను ఓటీటీ ఆడియెన్స్‌ ముందుకు తెస్తున్నాయి. అలా మలయాళంలో రిలీజైన మరో ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీలో రానుంది. అదే లైవ్‌(Live OTT). ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌, మమతా మోహన్‌దాస్‌(Mamta Mohandas), దసరా విలన్‌ షైన్ టామ్ చాకో, సౌబీన్ షాహిర్‌ కీలక పాత్రలు పోషించారు. సామాజిక మాధ్యమాల్లో వ‌చ్చిన ఫేక్ న్యూస్‌ కార‌ణంగా ఇబ్బందుల్లో పడ్డ ఇద్దరు అమ్మాయిల క‌థ‌తో మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా లైవ్‌ రూపొందింది. వీకే సురేష్‌ దర్శకత్వం వహించారు. మే26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అయితే సినిమాలోని థ్రిల్లింగ్‌ అంశాలు, ప్రియా ప్రకాష్‌ వారియర్‌(Priya Prakash Varrier), మమతల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్న లైవ్‌ మూవీ((Live OTT)) ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మ‌నోర‌మ మాక్స్ లైవ్‌ మూవీ డిజిటిల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జూన్‌ 27 అర్ధరాత్రి నుంచే లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తోంది.

- Advertisement -
Read Also:
1. పెళ్లిపై నటి ప్రియమణి షాకింగ్ కామెంట్స్
2. లంచ్ బాక్స్ స్పెషల్: హైదరాబాద్ దమ్ కిచిడీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...