పవన్ కల్యాణ్ సినిమాలో ప్రియమణి – ఏ చిత్రం ?

Priyamani in the movie Pawan Kalyan

0
88

వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఇక సాగర్ చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ సినిమా వస్తోంది. ఇక ఈ రెండు సినిమాలపై ఎన్నో అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో. ఇక మరో చిత్రం దర్శకుడు హరీశ్ శంకర్ తో పవన్ చేయనున్నారు.

ఇప్పటికే గబ్బర్ సింగ్ సినిమా గతంలో వీరి కాంబోలో వచ్చింది సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హేగ్డే పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంటుంది అని తెలుస్తోంది ఆ రోల్ కోసం హీరోయిన్ ప్రియమణిని సంప్రదిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

నారప్ప సినిమాలో ఇటీవల ఆమె పోషించిన పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. ఇక రానా నటించిన విరాటపర్వం సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర చేశారు. ఇక తాజాగా పవన్ సినిమాలో కూడా ఆమె కీలక రోల్ చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి దీనిపై ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ.