ప్రముఖ నటి ప్రియమణి తెలుగులో పలు సినిమాల్లో నటించారు, ఇక సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో కూడా ఆమె సినిమాలు చేశారు ..వివాహం తర్వాత పలు సినిమాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు ప్రియమణి..
ప్రస్తుతం రానా నటిస్తున్న విరాటపర్వం, వెంకటేశ్ నటిస్తున్న నారప్పసినిమాలలో ముఖ్య పాత్రలలో నటిస్తోంది.
తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ఆమె మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు అని తెలుస్తోంది…ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెని కలిసి కధ వినిపించారు అని వార్తలు వస్తున్నాయి..
లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు, ఇందులో మలయాళంలో మంజు వరియర్ పోషించిన కీలక పాత్రకి ప్రియమణి పేరును కూడా పరిశీలిస్తున్నారట.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇక ఆచార్య సినిమా పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమాకి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రియమణి పాత్రపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.