మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబోలో వస్తున్న సినిమాపై తొలి నుంచే తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మేజర్ పార్ట్ ఆఫ్రికా అడవుల్లో సాగనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. కాగా తాజాగా ఈ సినిమాలో మహేష్ జంటగా నటించడం కోసం మూవీ టీమ్.. ఇంటర్నేషనల్ బ్యూటీ, మాజీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కోసం ప్రియాంకలో SSMB29 టీమ్ చర్చలు జరిపిందని, అందుకు ప్రియాంక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న మాట.
ఈ సినిమాలో ప్రియాంక పాత్ర కూడా చాలా కీలకంగా, యాక్షన్ ప్యాక్‌డ్‌గా ఉండనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు హీరోయిన్‌గా నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్వాని, ఇండోనేషియా ముద్దుగుమ్మ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ప్రియాంకను ఫైనల్ చేయాలని మూవీ టీమ్ చెప్తోంది. కాగా ఈ చర్చలు ఇంకా జరుగుతున్నాయని, అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది అంటే 2025 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కూడా పలువురు విదేశీ నటీనటులు కూడా నటించనున్నారని, ఈ మూవీని పాన్ వరల్డ్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందుకోసం ఈ మూవీని భారతీయ భాషలో పాటు పలు విదేశీ భాషల్లోకి అనువదించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ బాబు(Mahesh Babu) నెవ్వర్ బిఫోర్ లుక్స్‌లో కనిపించనున్నాడట. పొడవాటి జుట్టు, రగ్‌డ్ గడ్డంతో పాటు సిక్స్‌ప్యాక్‌తో కూడా కనిపించన్నాడని టాక్ వినిపిస్తోంది.