ప్రస్తుత రాజకీయాలపై నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు..

-

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటబొమ్మాళి పీఎస్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ “బాగా చదువుకుని, బాగా సంపాదిస్తే, ఇంట్లోనే హ్యాపీగా ఉండండి. అంతేతప్ప రాజకీయాల్లోకి రాకండి. ఈ రోజు ఉన్న రాజకీయాల్లోకి ఒక వ్యక్తి రావాలంటే సిగ్గు, లజ్జ అన్నీ వదిలేయాలి. నన్ను ఎవడు తిట్టినా ఫర్వాలేదు. నా ఫ్యామిలీ ఫోటోలు ఎవడు సోషల్ మీడియాలో పెట్టిన ఫర్వాలేదు. నా ఫ్యామిలీని, కూతురును, భార్యను ఎవరు ఏమన్నా ఫర్వాలేదు. నాకేం పట్టదు అని బట్టలు విప్పి రోడ్డు మీద నడవగలిగిన వాడే ఈ రోజు రాజకీయాల్లోకి వెళ్లగలడు. చదువుకున్న వారు, ఆత్మాభిమానం ఉన్నవారు, చిన్న మాట అంటే పడని వారు మాత్రం రాజకీయాలకు సూట్ కారు. ఒకవేళ నేను పోటీ చేయాలి అనుకుంటే నేనూ అన్నింటిని వదిలేయాల్సిందే. లేదంటే ఇంట్లో కూర్చొవడం బెస్ట్” అని తెలిపారు.

- Advertisement -

కాగా జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన ‘కోటబొమ్మాళి(Kota Bommali)’ పీఎస్ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్ ప్రధానపాత్రలో కనిపించగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకుంటుందనే నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.

Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా దొరికిన నగదు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...