Dil Raju | ఏయ్ ఆపు.. సినీ జర్నలిస్టుకు దిల్ రాజు వార్నింగ్

-

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఓ సినీ పాత్రికేయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పిచ్చిపిచ్చిగా రాస్తే వదిలిపెట్టను.. గుర్తుపెట్టుకోండి.. ఏం పీకుతున్నారు అంటూ మండిపడ్డారు. ఆయనను ఆపడానికి వచ్చిన ఓ వ్యక్తిపైనా రెచ్చిపోయారు. వీడియో తీస్తున్న వ్యక్తిని ఏయ్ ఆపు అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

సోమవారం రాత్రి ఓ మూవీ ఫంక్షన్‌లో పాల్గొన్న దిల్ రాజు(Dil Raju).. ఆయనపై తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి సంక్రాంతికి తనపై తప్పుడు వార్తలు రాయడం, బురద జల్లడం అలవాటు అయిపోయిందని ధ్వజమెత్తారు. కొన్ని వార్తలని తెలియకుండా వక్రీకరించి రాస్తున్నారని ఇకపై అలా రాస్తే ఊరుకునేది లేదని ‘తాట తీస్తాను’ అని హెచ్చరించారు.

మీరు తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు తాను అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని మీరు నా గురించి వార్త రాసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా తనకు ఫోన్ చేస్తే మాట్లాడుతానన్నారు. తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అని చెప్పారు. మరోసారి చెబుతున్నా మీ వైబ్ సైట్లకు తనను వాడుకుంటే ‘తాటతీస్తా’అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్‌గా జర్నలిస్టుకు వార్నింగ్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Read Also: ఓటర్ల జాబితా అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...