నిర్మాతగా పవన్ చెర్రీ హీరో దర్శకుడు ఎవరంటే

నిర్మాతగా పవన్ చెర్రీ హీరో దర్శకుడు ఎవరంటే

0
105

మెగా హీరోలు సినిమాలు వరుసగా రానున్నాయి.. ఇది ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి. అయితే తాజాగా పవన్ కల్యాణ్ కూడా సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన పింక్ సినిమాలో నటిస్తారు అని అంటున్నారు. హిందీ సినిమా పింక్ తెలుగు రీమేక్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే పవన్ సినిమాల్లో నటించడం ఎలా ఉన్నా ఆయన నిర్మాతగా మారాలి అని భావిస్తున్నారట.

మంచి కథతో ఔత్సాహిక దర్శకులు వస్తే కథ నచ్చితే పెట్టుబడి పెట్టడానికి పవన్ సిద్దం అవుతున్నారు.. అంతేకాదు పవన్ నిర్మాతగా చిన్న సినిమాలు చేయాలి అని చూస్తున్నారు. దర్శకత్వం పై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది కాబట్టి ఆయనకు ఇది ప్లస్ అవుతుంది అంటున్నారు.

తన అన్న కుమారుడు, హీరో రామ్ చరణ్తో తప్పకుండా సినిమా నిర్మిస్తానని అంటున్నారు పవన్ కల్యాణ్..అయితే ఇంకా సినిమా కథ రెడీ అవుతోందట. అయితే రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ అయిన తర్వాత మాత్రమే, ఈ సినిమా ఉంటుంది అంటున్నారు.. అలాగే పవన్ కొత్త బ్యానర్లో సినిమాలు నిర్మిస్తారు అంటున్నారు.. సో చూడాలి పవన్ చెర్రీ చిత్రం ఎప్పుడు ప్రకటన వస్తుందో.