వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు ఉప్పెన సినిమాతో మంచి ఫేమ్ వచ్చింది… ఈ సినిమా తెలుగులోనే కాదు దేశంలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది …ఇప్పుడు పలు సినిమా అవకాశాలు వారికి వస్తున్నాయి… వారి నటనకు ఇటు టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారు ప్రశంసిస్తున్నారు.. ఇక ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు, ఇక మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి ఈ చిత్రాన్ని. ఇది సూపర్ హిట్ అయింది.ఉప్పెన చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది, తాజాగా హీరో హీరోయిన్లు, దర్శకుడికి నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని సర్ప్రైజ్ చేశారు. వైష్ణవ్‌కి రూ. 1 కోటి, కృతికి రూ. 25 లక్షలు మర్యాదపూర్వకంగా అందించారు..దర్శకుడు బుచ్చిబాబుకి ఫ్లాట్ లేదా మంచి కార్ ఇద్దామనుకున్నారు, అయితే అతనికి కారు అందించారు.బ్యూటిఫుల్ పోష్ కార్ ఇచ్చి మరోసారి ఆనందంలో ముంచెత్తారు.. ఇక కలెక్షన్లతో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతోంది, ఇక దాదాపు త్వరలో ఈ చిత్రం 100 కోట్ల మార్క్ దాటుతుంది అంటున్నారు అందరూ.
ఉప్పెన హీరో హీరోయిన్ కు దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నిర్మాతలు
-