జబర్దస్త్ కామెడీ షో ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా చాలా మంది కమెడియన్లు పరిచయం అయ్యారు.. దాదాపు చిత్ర సీమకు 20 మంది కమెడియన్లు వచ్చారు.. ఎంతో మంది ఇంకా జబర్ధస్త్ కంటిన్యూ చేస్తున్నారు… పాతవారు వెళుతుంటే కొత్తవారు ఎంట్రీ ఇస్తున్నారు… ఇక సుడిగాలి సుధీర్ టీమ్ ఎంత ఫేమస్సో తెలిసిందే, ఆ తర్వాత అంత ఫేమ్ తెచ్చుకున్నాడు హైపర్ ఆది, ఆ తర్వాత ఇప్పుడు మరో నటుడు అంత ఫేమ్ పొందాడు, ఇతని పేరు ఇప్పుడు తెగ వినిపిస్తోంది, అతను ఎవరో కాదు
ఇమ్మాన్యుయేల్.
ఇప్పుడు జబర్దస్త్ షోతో పాటు బయట ఈవెంట్స్ కూడా కుమ్మేస్తున్నాడు, ఇక సీరియల్ బ్యూటీ వర్షతో స్కిట్లు మరింత సరదాగా సాగుతున్నాయి, ఎప్పటికప్పుడు వర్షతో ఈయన చేసే రొమాన్స్ హైలైట్ అవుతుంది. అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది,
జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు ప్రమోషన్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
నిజమే ఇటీవల ఆది తర్వాత అంత వేగంగా పేరు ఫేమ్ సంపాదించిన వ్యక్తి ఇమ్మాన్యుయేల్ అంటున్నారు అందరూ…. ఇప్పుడు తాజాగా ఆయనని టీమ్ లీడర్ చేస్తున్నారట, మరో రెండు వారాల్లో దీనిపై క్లారిటీ రావచ్చు అంటున్నారు, అతని అభిమానులు మాత్రం ఈ వార్త విని చాలా ఆనందిస్తున్నారు.
|
|
|
జబర్దస్త్ కామెడీ షో ఇమ్మాన్యుయేల్ కు ప్రమోషన్
-