పవర్ స్టార్(Pawan Kalyan).. ఈ పేరు వింటే చాలు ఒక తరం యువత ఊగిపోతుంటారు. ఆయన తెరమీద కనిపిస్తే చాలు సెలబ్రేషన్స్ చేస్తుంటారు. ఆయన సినిమా కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పవన్ కల్యాణ్ ఇటీవల మరోసారి బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించగా.. కేతికా శర్మ, ప్రియాంకా వారియర్, వెన్నెల కిశోర్, రోహిణీ తదితరులు నటించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ మెగా మల్టీ స్టారర్ సూపర్‌హిట్‌గా నిలిచింది.
విడుదలైన మొదటి మూడురోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి పవర్ స్టార్(Pawan Kalyan) సత్తా ఏంటో మరోసారి రుజువు చేసింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న బ్రో మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ పవన్ కల్యాణ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. గత శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. కాగా, స్ట్రీమింగ్‌కు వచ్చి ఆరు రోజులవుతన్నా బ్రో సినిమా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్స్‌లో టాప్‌లో నిలవడం విశేషం. ఇక వరల్డ్ వైడ్‌గా అయితే ఇంగ్లీష్ క్యాటగిరిలో 7వ ప్లేస్‌లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో 8వ స్థానంలో నిలిచింది. కాగా ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తానికి అటు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది.