దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 2(PS 2)’. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా సంచలన రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. పార్ట్-1తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్స్ అనుకున్నప్పటికీ, రెండోరోజు నుంచి భారీ రీచ్ అందుకుంది. తాజా అప్ డేట్ ప్రకారం జస్ట్ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్లు రాబట్టింది. అయితే మొదటి భాగం సుమారు రూ. 600 కోట్లకి పైగా రాబట్టగా.. మరి ఈ రెండో భాగం(PS 2) మరెన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు బ్యానర్‌పై విడుదల చేశారు.
Read Also: రెండో రోజు ‘ఏజెంట్’ మూవీ కలెక్షన్స్ తెలిస్తే షాకే.. మరీ ఇంత దారుణమా?
Follow us on: Google News, Koo, Twitter