కడసారి చూపు కోసం..బెంగళూరు చేరుకున్న పునీత్ పెద్ద కూతురు

Puneet is the eldest daughter who reached Bangalore for the first time

0
98

న్యూయార్క్‌లో చదువుతున్న పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి ఈరోజు (అక్టోబర్ 30) మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. బెంగళూరు విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.15 గంటలకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు కంఠీరవ స్డేడియంలో వస్తారు. కాగా పై చదువులకోసం ధృతి రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు.

నటుడు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈరోజు సాయంత్రం (అక్టోబర్ 30) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.