పునీత్ రాజ్​కుమార్ డ్రీమ్ ప్రాజెక్టు టీజర్ రిలీజ్ (వీడియో)

Puneet Rajkumar Dream Project Teaser Release (Video)

0
123

ఇటీవల గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్​కుమార్ డ్రీమ్​ప్రాజెక్టు ‘గందద గుడి’ టీజర్​ రిలీజైంది. ఆయన తల్లి పార్వతమ్మ జయంతి సందర్భంగా ఈ టీజర్​ను రిలీజ్​ చేశారు. కర్ణాటకలోని వైల్డ్​లైఫ్​ ఆధారంగా తీసిని ఈ డాక్యుమెంటరీని పునీత్​ స్వయంగా నిర్మించారు. అలానే దీనిని తెరకెక్కించిన అమోఘ వర్షతో కలిసి ఇందులో నటించారు. వచ్చే ఏడాది, థియేటర్లలో ‘గందద గుడి’ని రిలీజ్ చేయనున్నారు.

నిమిషం పాటు సాగే ఈ టీజర్​లో కర్ణాటకలోని అడవులు, జలపాతాలు చూపించారు. వీటి వెంట నడుస్తూ కనిపించిన పునీత్-అమోఘ వర్ష.. నీటి లోపల కూడా డైవింగ్ చేస్తూ కనిపించారు. 1973లో కన్నడలో హిట్​గా నిలిచిన ‘గందద గుడి’ సినిమాలో పునీత్ తండ్రి, కన్నడ కంఠీవ డాక్టర్.రాజ్​కుమార్ హీరోగా నటించారు. ఆ పేరునే ఈ చిత్రానికి పెట్టారు. అక్టోబరు 29న అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల పునీత్ మరణించారు. మరోవైపు ఆయన మరణాన్ని తట్టుకోలేక పలువురు అభిమానులు కూడా తనువు చాలించారు.