Breaking- పునీత్‌ అంత్యక్రియలు వాయిదా..కారణం ఇదే

0
104

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ దుఃఖంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను అటు సినీ పరిశ్రమతో పాటు..ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహాన్ని బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు.

తమ అభిమాన హీరోను కడసారి చూసుకునేందుకు అభిమానులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటీనటులు..అభిమానులు బరువెక్కిన గుండెతో కన్నడ పవర్ స్టార్‏కు నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఇంతవరకూ ఈరోజు సాయంత్రమే పునీత్ అంత్యక్రియలు జరుగుతాయని అనుకోగా, తాజాగా ఆ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేశారు. ఈ విషయాన్నీ కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా ప్రకటించారు.

ఆయన కూతురు అమెరికా నుంచి వచ్చాకే అంత్యక్రియలు జరుగుతాయని, ఈరోజు సాయంత్రం 5 గంటలకు పునీత్ కూతురు బెంగుళూరుకు చేరుకుంటుందని అనుకున్నారు. కానీ ఆమె ఇంకా బెంగుళూరుకు చేరుకోకపోవడంతో పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేశారు. ఇక పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ రేపు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన తల్లిదండ్రులు రాజ్ కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు కూడా అదే స్టేడియంలో నిర్వహించారు.