పూరీ సినిమాలో రామ్ సరికొత్త రోల్

పూరీ సినిమాలో రామ్ సరికొత్త రోల్

0
90

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ రామ్ చాలా పాత్ర‌లు చేశాడు, చాలా వ‌ర‌కూ స‌క్స‌స్ సినిమాల‌తోనే టాలీవుడ్ లో ముందుకు వెళుతున్నాడు, ఇస్మార్ట్ తో మెరిశాడు, అయితే తాజాగా ఓ సినిమాలో అతిధిపాత్ర చేయ‌నున్నాడ‌ట‌…వచ్చే ఏడాది రొమాంటిక్ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు రామ్.

అవును పూరీ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగాఈ సినిమా వ‌స్తోంది.. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ కథని ఇచ్చారు, దీనికి నూతన దర్శకుడు అనిల్‌ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు.పూరి, చార్మి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమాలో కేతికా శర్మ కథానాయిక అంతేకాదు మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తాజాగా టాలీవుడ్ టాక్ ప్రకారం ఓ సర్‌ప్రైజ్‌గా రామ్‌ పాత్ర ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రామ్ తో చిత్రయూనిట్ షూటింగ్ కూడా చేశారట. రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు అని తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఏమిటో చూడాలి.