గోవా లో పూరి..విజయ్ దేవరకొండ రొమాన్స్ అదురుతుందట..!!

గోవా లో పూరి..విజయ్ దేవరకొండ రొమాన్స్ అదురుతుందట..!!

0
93

ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత పూరి జగన్నాధ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉండగా, తన కొత్త సినిమాకి స్క్రిప్ట్ ను రెడీ చేయడానికి ఆయన ఎక్కువగా బ్యాంకాక్ వెళుతుంటాడు. అప్పుడప్పుడు గోవా కూడా వెళుతుంటాడు. బ్యాంకాక్ తరువాత ఆయనకి బాగా నచ్చిన ప్రదేశం గోవానే. అందువల్లనే అక్కడ తన సినిమాకి సంబంధించిన సీన్ ఒకటైనా తీస్తుంటాడు.

తన తాజా చిత్రం కోసం ఆయన గోవా వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో ఉండనుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ఆయన అక్కడికి వెళుతున్నాడు. బౌండ్ స్క్రిప్ట్ తోనే ఆయన అక్కడి నుంచి తిరిగి వస్తాడని అంటున్నారు. ప్రస్తుతం క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ చేస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా పూర్తికాగానే, పూరి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.