పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు, మరో పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు, ఓ పక్క షూటింగులు మరో పక్క రాజకీయ సమావేశాలతో అస్సలు ఖాళీ లేదు పవర్ స్టార్ కి.. ఈ సమయంలో పలు కధలు వింటూ సినిమాలు ఒకే చేస్తున్నారు, పవన్ కల్యాణ్ దాదాపు మరో రెండు చిత్రాలు ఒకే చేశారు.
వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ఫైనల్ కు చేరింది, ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నారు, అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఓ సినిమా చేయాలి అని చూస్తున్నారట పవన్ కల్యాణ్..
పూరీ గతంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న జనగణమన సినిమాను పవన్తో చేయనున్నాడట.
ఈ స్టోరీ పవన్ కు కూడా ఇప్పటికే పూరీ జగన్నాథ్ చెప్పారట, ఆయనకు స్టోరీ నచ్చింది అని తెలుస్తోంది.