విమర్శల పాలవుతున్న పూరి కొడుకు చిత్రం ఫోటో..!!

విమర్శల పాలవుతున్న పూరి కొడుకు చిత్రం ఫోటో..!!

0
133

పూరి తనయుడు హీరో గా పాతుకుపోవాలని చాల ప్రయత్నాలే చేస్తున్నాడు.. మెహబూబా సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం రొమాంటిక్.. ఈ చిత్రం ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ అయ్యింది.. బట్టల్లేకుండా ఉన్న హీరోయిన్ ని హాగ్ చేసుకున్న ఈ పోస్టర్ చూస్తే బాగానే అనిపించినా చాల వల్గారిటీ ఇందులో ఉంది.. ఫామిలీ ప్రేక్షకులు ఇది చూడాలంటే ఇబ్బంది పడతారు..

అందుకేనేమో ఈ చిత్ర పోస్టర్ గురించి మహిళా సంఘాలు కూడా గోల పెడుతున్నాయి. అసలు ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి సినిమాలు చేస్తున్నారంటూ వాళ్లు రచ్చ చేస్తున్నారు. బ్యాక్ లెస్ పోజుతో ఈ పోస్టర్ విడుదల చేసాడు దర్శకుడు అనిల్. దీనికి కథ, స్క్రీన్ ప్లే పూరీ అందిస్తున్నాడు. మెహబూబాతో ఎలాగూ హిట్ ఇవ్వలేకపోయిన పూరీ.. రొమాంటిక్ తో కచ్చితంగా హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.