పూరి ‘జనగణమన’ ఆ హీరోతోనే..అధికారిక ప్రకటన వచ్చేసింది!

0
106

ప్రస్తుతం పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’. ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండకు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కానుంది.  నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే వార్త చేప్పారు పూరి. లైగర్‌ పూర్తి కాగానే విజయ్ తో మరో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఈ సినిమాకు ‘జనగణమన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. అంతేకాదు ఈ సినిమాను 2023 ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పూరి సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతోంది.