మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ‘పుష్ప-2(Pushpa 2)’ టాప్‌లో ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. అందరూ ఆత్రుతగా వేచి చూస్తున్న సినిమా మరి కొద్ది రోజుల్లోనే థియేటర్లను మోతమోగించనుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో టాప్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) పాల్గొన్నాడు. ఈ వేడుక సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ.. పుష్ప-2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప-2 ఒక ప్రమోషన్స్ అక్కర్లేని సినిమా అని అన్నాడు జక్కన్న.
‘‘పుష్ప సినిమాకు ప్రమోషన్స్ అక్కర్లేదు. ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెచిచూస్తోంది. అంతకన్నా పెద్ద ప్రమోషన్ ఏం కావాలి. ఏమీ అవసరం లేదు. తెలుగు సినీ చరిత్రలో నేషనల్ అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకుంటాడని భావిస్తున్నా. ఈ సినిమాతో సుకుమార్(Sukumar) కూడా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం పక్కా’’ అని అన్నాడు రాజమళి(Rajamouli). ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.