మరోసారి పుష్ప 2 సినిమా వాయిదా?

-

మరోసారి పుష్ప 2(Pushpa 2) వాయిదా పడనుందా? అల్లు అర్జున్ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పుష్ప 2 సినిమా ముందుగా 2024 ఆగస్ట్ లో రిలీజ్ అని ఆశ పెట్టి మళ్లీ డిసంబర్ నెలకు వాయిదా వేశారు. కానీ ఈ సినిమా ఇపుడు మళ్లీ వచ్చే సంవత్సరం సమ్మర్ కి వాయిదా వేయనున్నట్టు సమాచారం. హీరోకి, డైరెక్టర్‌కి మధ్య స్క్రిప్ట్ విషయంలొ విబేధాలు వచ్చాయని సోషల్ మీడియాలో రూమర్స్ రావడం, ఆ కారణంగానే బన్నీ డేట్స్ ఇవ్వట్లేదని, అంతే కాకుండా ఇపుడు బన్నీ షేవింగ్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం ఈ వార్తలకు బలాన్నిస్తుంది.

- Advertisement -

అదే కాకుండా ఫ్యామిలీతో బన్నీ ఫారిన్ ట్రిప్ వెళ్ళడం, అదే సమయానికి డైరెక్టర్ సుకుమార్ ఫారిన్ ట్రిప్ నుండి తిరిగి వస్తున్నారు అని సమాచారం. సినిమాలో కీలక పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ డేట్స్ ఇచ్చినపుడు పుష్ప టీం వాడుకోలేకపోయింది, ఇపుడు ఫహద్ డేట్స్ అవసరం అయిన సమయంలొ ఆయన వేరే సినిమాలతో బిజీ ఉన్నారని తెలుస్తోంది. దీంతో పుష్ప 2(Pushpa 2) మరోసారి వాయిదా పడనుందా అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Read Also: ‘నన్ను క్షమించండి’.. ఫ్యాన్స్‌కు నవీన్ పోలిశెట్టి మెసేజ్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రభాస్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. రీ రిలీజ్ కానున్న ఏడు సినిమాలు

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజుకు ఎంతో సమయం లేదు. అక్టోబర్ 23న...

సల్మాన్‌ ఖాన్‌ను సఫా చేయడానికి ప్లాన్.. మరొకరు అరెస్ట్..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను హత్య చేయడం...