Pushpa 2 Teaser | ‘పుష్ప’ గాడి మాస్ జాతర మొదలు.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్..

-

Pushpa 2 Teaser | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ‘పుష్ప2’ మూవీ యూనిట్ క్రేజీ న్యూస్ అందించింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. “పుష్ప మాస్ జాతరను మొదలుపెడదాం. ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప2- ది రూల్ టీజర్ ఏప్రిల్ 8వ తేదీన రానుంది. ఫైర్‌ను డబుల్ చేసేందుకు అతడు వచ్చేస్తున్నాడు” అని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఈఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుందని పేర్కొంది. ఈ పోస్టర్‌ చూస్తుంటే జాతర సీక్వెన్సులో వెనుక దీపాలు వెలుగుతుండగా.. నేలమీద పడిన కుంకుమపై అల్లు అర్జున్ గజ్జెలు ధరించిన కాలు మోపినట్టు ఉంది.

- Advertisement -

Pushpa 2 Teaser | ఈ మూవీలో జరిగే గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ అమ్మోరు అవతారంలో నాట్యం చేయనున్నారట. అలాగే అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని.. కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే సుకుమార్ చాలా ఖర్చు చేసి తెరకెక్కించారట. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.

Read Also: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...