తగ్గేదేలే అంటున్న ‘పుష్ప’ డైరెక్టర్..సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..!

'Pushpa' director says that it is declining..Sukumar's next projects are ..!

0
119

పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ తన నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. పుష్ప మూవీ ప్రమోషన్ లో సమయంలో సుకుమార్ తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ.. బన్నీతో పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 ఉండనున్నదని తెలిపాడు.

అనంతరం విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కించనున్నానని చెప్పాడు. రంగస్థలం తర్వాత మరొకసారి రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ అనడంతో ఇప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాక విజయ్ దేవరకొండ సైతం ప్రస్తుతం లైగర్ తో పాన్ ఇండియా హీరోగా మారనున్నారు. సుకుమార్ వరుస పాన్ ఇండియా మూవీలు చేస్తుండటంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ధియేటర్లో సందడి చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్నా తొలిసారిగా బన్నీతో జతకట్టింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.