పుష్ప సినిమా ఆ డేట్ న రిలీజ్ కానుందా ? టాలీవుడ్ టాక్

Pushpa Movie released date updates

0
102

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బన్నీని చాలా సరికొత్తగా చూపించనున్నారు సుకుమార్. ఇక బన్నీ లుక్ అభిమానులకు బాగా న‌చ్చింది. సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ కరోనా పరిస్దితి వల్ల‌ షూటింగ్ కాస్త లేట్ అయింది.

అయితే ఇప్పుడు మళ్లీ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మరో నెల రోజుల్లో మొత్తం సినిమా షూటింగ్ పూర్తి అయిపోనుందట‌. ముందు ఈ సినిమా పూర్తి అయి ఉంటే, ఈ చిత్రం దసరా బరిలో నిలిచేది. కానీ కరోనా వలన షూటింగ్ లో జాప్యం జరుగుతూ వచ్చింది.

ఇక తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ పై నుంచి పూర్తి అయి ఎడిటింగ్ కు వెళ్లిన తర్వాత రిలీజ్ డేట్ పై అనౌన్స్ మెంట్ రావ‌చ్చు అంటున్నారు.