పుష్ప: సమంత ఐటెం సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

0
103

చైతూతో విడాకుల అనంతరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది సమంత.  పాన్‌ ఇండియా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉండగా అంతర్జాతీయ సినిమా ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ ఈ ఏడాది విడుదల కానుంది. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వరుస సినిమాలకు సామ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

అలాగే ఆమె తొలిసారి ఓ ఐటమ్‌ సాంగ్‌లో తళుక్కున మెరిశారు. ‘పుష్ప’ సినిమా కోసం ‘ఊ అంటావా మావ’ అంటూ బన్నీతో కలిసి స్టెప్పులేశారు. సమంత వేసిన స్టెప్పులతో ఈ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. సుమారు రెండు వారాల క్రితం విడుదల చేసిన ఈ పాట ఫుల్‌ వీడియో 73 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

తాజాగా ‘ఊ అంటావా మావ’ ఊ ఊ అంటావా మావ అంటూ సాగే వీడియో సాంగ్ కు సంబంధించి మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో సమంత తన ప్రాక్టీస్ తోనే అదరగొట్టింది. ప్రత్యేకించి కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ హైలెట్ గా నిలిచాయి.

https://youtu.be/rf2zJi8snZ4