‘పుష్ప’ రెండో సాంగ్ రిలీజ్..

Pushpa 'Second Song Release

0
105

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు దసరా కానుక రెండురోజుల ముందే వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా పుష్పరాజ్‌ పాత్రలో నటిస్తున్న ‘పుష్ప’ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే’ అంటూ సాగే ఈ పాటను తాజాగా చిత్రబృందం సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది.

తన ప్రేయసి శ్రీవల్లి(రష్మిక) చూపులకు ముగ్ధుడై.. ఆమెపై తనకున్న ప్రేమను పుష్పరాజ్‌ తెలియజేస్తున్నట్లు ఈ పాటను తీర్చిదిద్దారు. దేవిశ్రీ స్వరాలు అందించగా సిద్ధ్‌ శ్రీరామ్‌ ఈ పాటను అలపించారు. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ పాట సినీ ప్రియుల్ని ఎంతగానో అలరిస్తోంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈచిత్రాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=5IEbR79kBPY&t=15s