‘పుష్ప’ తగ్గేదేలే.. ట్రైలర్‌ చూస్తే పూనకాలే (వీడియో)

‘Pushpa’ taggedele .. Poonakale if you watch the trailer

0
103
Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్  అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ‘పుష్ప’ ట్రైలర్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్​గా హీరోగా నటించిన ఈ సినిమా.. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ట్రైలర్ లో బన్నీ నట విశ్వరూపం చూపించారు. మాస్ పాత్రలో ఇరగదీశాడు. ట్రైలర్ ఆసాంతం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఒకటి రెండు చోట్ల.. రష్మిక వెంట పడుతూ కనిపించాడు పుష్పరాజ్. అలాగే ఈ సినిమా సునీల్ విలన్ గా కనిపించాడు.. అలాగే ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

‘పుష్ప’.. అల్లు అర్జున్-సుకుమార్​కు హ్యాట్రిక్ చిత్రం. ఆర్య, ఆర్య 2 సినిమాతో సినీ ప్రేమికుల్ని అలరించిన ఈ జోడీ.. ఇప్పుడు రాబోయే ‘పుష్ప’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాలో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది.

https://www.youtube.com/watch?v=Q1NKMPhP8PY&feature=emb_title