పుష్ప థర్డ్‌ సింగిల్‌ ‘సామీ సామీ’ సాంగ్‌ రిలీజ్‌

Pushpa Third Single Sami Sami Song Release

0
114

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ‘పుష్ప’ నుంచి విడుదలైన.. దాక్కో దక్కో మేక’, ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ పాటలు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్‌ సింగిల్‌ సామీ సామీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.  అల్లు అర్జున్, రష్మిక ఇందులోని తమ డ్యాన్స్​, ఆహార్యంతో ఆకట్టుకుంటున్నారు.

‘నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ’ అంటూ సాగే ఈ సాంగ్‌ ఆకట్టుకుంటుంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా..మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్​ పకడ్బందీగా ఉంది. ప్రస్తుతం చేస్తున్న ‘పుష్ప’ తర్వాత ‘ఐకాన్’, ‘పుష్ప 2’, స్టార్ డైరెక్టర్ మురగదాస్​తో సినిమాలు చేయాల్సి ఉంది. బోయపాటితోనూ మరోసారి కలిసి పని చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.

సాంగ్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?time_continue=5&v=C70GJYVoZ4Y&feature=emb_title