స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇ
ప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో పుష్ప నుంచి వరుస అప్డేట్స్…ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
ఇక పుష్ప ట్రైలర్ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా పుష్ప ట్రైలర్ టీజ్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ట్రైలర్ టీజ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోతో పుష్ప సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు చిత్రయూనిట్.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=8KLCadalvfQ&feature=emb_title