పుష్ప అప్ డేట్- అల్లుఅర్జున్​ కొత్త లుక్​ చూశారా?

Pushpa Update- Have you seen Allu Arjun's new look?

0
101

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి సామి’ సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రంలోని నాలుగో పాట ‘ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డా’ నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది.

ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. నుదుటన బొట్టు, ఒంటినిండా బంగారపు చైన్లు, ఉంగరాలతో కళ్లజోడు పెట్టుకుని సరికొత్త అవతారంలో కనిపించారు. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.