పుష్ప చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఎవ‌రంటే

పుష్ప చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఎవ‌రంటే

0
97

అల్లు అర్జున్ సుకుమార్ కొత్త సినిమా పుష్ప‌, ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ క‌రోనా వైర‌స్ లాక్ డౌన్ తో నిలిపివేశారు, అయితే ఈ లాక్ డౌన్ ముగిసిన త‌ర్వాత మ‌ళ్లీ య‌దాత‌ధంగా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఇందులో బన్నీ ఎర్రచందనం దుంగలని చేరేవేసే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారని చెబుతున్నారు.

ఇక బ‌న్నీకి హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ అందాల భామ ర‌ష్మిక న‌టిస్తోంది.. ఈ సినిమాలో చిత్తూరు అమ్మాయిగా రష్మిక కనిపిస్తోంది. ప్రస్తుతం చిత్తూరు యాసని ప్రాక్టీస్ చేస్తోందామె. అయితే ఆమెనా మ‌రో హీరోయిన్ ఉంటుందా అనే చ‌ర్చ కూడా కొద్ది రోజులుగా న‌డుస్తోంది.

తాజాగా ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కు కూడా అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది, అందుకే బ‌న్నీకి సెకండ్ హీరోయిన్ గా ఈ చిత్రంలో నివేదా థామస్ కి అవ‌కాశం దక్కినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి,,. ఇక ఈ చిత్రంలో ఆమె రిచ్ గా క‌నిపిస్తార‌ట‌, బ‌న్నీని ఇందులో ఆమె ప్రేమిస్తార‌ట‌, ఈ లాక్ డౌన్ తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.