పుష్ప సినిమాలో బాలీవుడ్ భామ – భారీ రెమ్యునరేషన్ ? ఎవరంటే

పుష్ప సినిమాలో బాలీవుడ్ భామ - భారీ రెమ్యునరేషన్ ? ఎవరంటే

0
125

పుష్ప సినిమా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది , అయితే కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేకులు ఇచ్చారు, అయితే వచ్చే నెల నుంచి కరోనా తీవ్రత తగ్గితే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది, అయితే సుకుమార్ సినిమాలలో కచ్చితంగా సాంగ్స్ హైలెట్ అవుతాయి.

ఇక ఐటెమ్ సాంగ్ కూడా కచ్చితంగా ఉండాల్సిందే, అయితే ఈసారి కూడా సుకుమార్ బన్నీ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట, అందుకోసం బాలీవుడ్ భామని ఎంపిక చేస్తున్నారు అని తెలుస్తోంది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ తో ఈ సాంగ్ చేయించాలి అని చూస్తున్నారట.

పలువురిని పరిశీలించినా ఫైనల్ గా శ్రద్దాకపూర్ ని ఒకే చేశారు అని తెలుస్తోంది, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట, ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో రష్మిక నటిస్తోంది, ఇక శ్రద్దా కపూర్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి, మరి దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.